మా అమ్మకు అలాంటి విషయాలు తెలియవు: నీరజ్‌ చోప్రా

-

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ అందించాడు బల్లెం వీరుడు నీరజ్ చోప్రా. జావెలిన్‌ త్రో ఈవెంట్‌ ఫైనల్లో పాకిస్థాన్‌ జావెలిన్‌ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్‌ 92 మీటర్లతో స్వర్ణం సాధించగా, నీరజ్‌ 89.45 మీటర్లతో రజతం సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నీరజ్కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. మరోవైపు తమ కుమారుడు రజతం సాధించడం పట్ల నీరజ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ఈ సందర్భంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తన తల్లి వ్యాఖ్యలపై నెట్టింట వస్తున్న విమర్శలపై తాజాగా ఈ బల్లెం వీరుడు స్పందించాడు. పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌ కూడా తన కొడుకులాంటి వాడేనని సరోజ్‌ దేవి వ్యాఖ్యానించడంపై నీరజ్‌ చోప్రా వివరణ ఇచ్చాడు. తన తల్లికి అలాంటి విషయాలు తెలియవని.. ఆమె గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిందని తెలిపారు. సోషల్‌మీడియా, టెలివిజన్లలో వచ్చే భారత్‌- పాక్‌ సంబంధాల గురించి ఆమెకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. ఆమె తల్లి హృదయంతో అలా మాట్లాడిందని.. అది కొందరికి నచ్చింది.. మరికొందరికి వింతగా అనిపించిందని అన్నారు.

ఇంతకీ నీరజ్ తల్లి ఏం అన్నారంటే..

“నా కొడుకు సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడు కూడా కుమారుడి లాంటివాడే. నీరజ్‌ ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చాక అతడికిష్టమైన వంటకాలను వండిపెడతాను” అని నీరజ్‌ తల్లి సరోజ్‌ దేవి పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news