ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. నిన్న ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది హైదరాబాద్ జట్టు. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇందులో హైదరాబాద్ బ్యాటర్ హెడ్ 62 పరుగులు చేశారు.
అభిషేక్ శర్మ 63 పరుగులు చేశాడు. ఇక క్లాసన్ 34 బందులో 80 పరుగులు చేసి… శభాష్ అనిపించాడు. అనంతరం 258 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్… మొదటినుంచి తడబడుతూనే ఉంది. ఇక చివరికి నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. దీంతో హైదరాబాద్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్ జట్టు. అయితే.. పాండ్యా కెప్టెన్సీ వల్లే.. ముంబై ఓడుతుండటంతో…మళ్లీ రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వాలనే ఆలోచనలో ముంబై ఉందట.