అంతర్జాతీయ క్రికెట్ లోకి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మన్కడింగ్ ను నిషేధిస్తూ.. క్రికెట్ రూల్స్ నుంచి తొలగిస్తున్నట్లు మెరిట్ బోర్న్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. మన్కడింగ్ క్రీడాస్ఫూర్తి విరుద్ధమని… ఇకపై మన్కడింగ్ కు ఛాన్స్ లేదని స్పష్టం చేసింది. అలాగే ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందు ఇద్దరూ బ్యాటర్స్ క్రీజులో ఒకరినొకరు దాటితే.. ఇకపై క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు వెళ్లాలి.
ఇంతకు ముందు ఏ బ్యాట్స్ మెన్ అవుట్ అయినా.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ నాన్ స్ట్రయిక్ ఎండ్ కు వెళ్లాలనే నిబంధన ఉండగా.. దీనిని సవరించింది. బంతిని మెరిపించేందుకు బౌలర్లు సలైవాను ఉపయోగించకూడదని కరోనా సమయంలో ఎంసీసీ తెలిపింది. తాజాగా ఎంసీసీ సలైవానను పూర్తిగా నిషేధించింది. అలాగే క్రికెట్ లో లా 22.1 ప్రకారం.. ఇకపై స్ట్రయిక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ నిల్చున్న స్థానం నుంచి.. బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించాలనే కొత్త నిబంధనను ఎంసీసీ అమలులోకి తీసుకురానుంది.