బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో.. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 356 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర 134 రన్స్ చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ టిమ్ సౌథీ 65 రన్స్ చేశాడు. ఎనిమిదో వికెట్‌కు రవీంద్ర, సౌథీలు.. 137 రన్స్ జోడించారు. విల్ యంగ్ 33 పరుగులు చేశారు.
ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ రెండు వికెట్లు తీసుకోగా.. బుమ్రా-అశ్విన్‌కు చెరో వికెట్ దొరికింది. రచిన్ రవీంద్ర సెంచరీలో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. తొలి టెస్ట్ లో భారత్ పై తొలి ఇన్నింగ్స్ లో ఇదే అత్యధిక లీడ్ కావడం విశేషం. కివిస్ తొలి ఇన్నింగ్స్ లో 2016లో 412 జింబాబ్వే, 2005లో 393 జింబాబ్వే, 1985లో 374 ఆస్ట్రైలియా, 2004లో 363 బంగ్లాదేశ్ పై లీడ్ సాధించింది. అందే దాదాపు 20 ఏళ్ల తరువాత ఇండియా పై ఈ స్థాయి ఆధిక్యత కనబరిచింది.