ధోనీ 19:29 గంట‌ల‌కే ఎందుకు రిటైర్ అయ్యాడో తెలుసా..?

-

అంతర్జాతీయ క్రికెట్​కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన ఇన్​స్టా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2004 డిసెంబరు 23న తొలి వన్డే మ్యాచ్‌ ఆడాడు మహీ. ఈ మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై అరంగేట్రం చేశాడు. 2005 డిసెంబరు 2న తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీఫైనల్​లో న్యూజిలాండ్​తో​ చివరి మ్యాచ్​ ఆడాడు. అప్పటి నుంచి క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు.


ఇప్పుడు కొంతమంది మనసులో ఒక సందేహం ముదురుతోంది. ధోని రిటైర్మెంట్ ను తెలియజేయడానికి ఆగస్టు 15 న 19:29 అనే సమయాన్ని ఎందుకు ఎంచుకున్నాడు. ఆ సమయానికి ఏమైనా ప్రత్యేక ఉందా అనే దిశగా క్రీడాభిమానులు, విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ధోని ఈ వార్తను తెలియజేసిన అప్పుడు సోషల్ మీడియా వేదికలో భావోద్వేగ వీడియోను పెట్టాడు. అందులో అనేక అంశాల గురించి అతను చెబుతూ తన క్రీడా ప్రస్థానం గురించి చర్చించాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ సమయానికి ఉన్న లింక్ ఎంటి అని ఆలోచిస్తున్నారు.ధోనీ జెర్సీ నెంబర్ 7 , రైనా జెర్సీ నెంబర్ 3 ఈ రెండు కలిపి 73 అయితే… సరిగ్గా స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాల అయింది. ఇందుకేనా తన రిటైర్మెంట్ ఈ వార్తను స్వతంత్ర దినోత్సవం రోజు తెలిపాడు.

ఇక ధోనీ అదే టైముకు రిటైర్మెంట్‌ను ప్ర‌క‌టించ‌డం వెనుక ఉన్న మ‌రో కార‌ణం.. 2019 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌లో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్.. న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన స‌మ‌యం 19.29 కాగా.. స‌రిగ్గా అదే టైముకు ధోనీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అలాగే 1929 నంబ‌ర్‌ను ఏంజ‌ల్ నంబ‌ర్ అంటారు. ఓ వ్య‌క్తి త‌న జీవితంలో గొప్ప ప‌నిని పూర్తి చేసిన‌ప్పుడు అందుకు సూచ‌కంగా ఈ నంబ‌ర్‌ను వాడుతారు. ధోనీ కూడా టీమిండియాకు గొప్ప‌గా సేవ‌లు అందించి రిటైర‌య్యాడు.. క‌నుక‌నే అత‌ను ఆ నంబ‌ర్ వచ్చేలా 19.29 గంట‌ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news