సూర్య కుమార్‌పై పాక్‌ మాజీ క్రికెటర్‌ వివాదస్పద వ్యాఖ్యలు..బ్యాటింగ్‌ కు పనికిరాడు !

-

India vs Pakistan : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇ వాళ ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అమీర్ సోహైల్ మాత్రం సూర్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ప్రతి మ్యాచ్ లో చెలరేగుతున్న సూర్య పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.

“నేను పాకిస్తాన్ బౌలర్ల గురించి మాట్లాడుతున్నాను. పాక్ బౌలింగ్ లైనప్ చూసినట్లయితే, చాలా బలంగా ఉంది. భారత జట్టులో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఈ సమయంలో నేను పాకిస్తాన్ కెప్టెన్ అయ్యుంటే నా ముందు సూర్య కుమార్ లేదా ఇంకెవరి పేరు ప్రస్తావించిన నాకు పెద్ద ఇబ్బందిగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వివ్ రీచార్డ్స మాదిరిగా బ్యాటింగ్ చేయలేరు. సూర్యకుమార్ కూడా అందరిలాంటి ఆటగాడే, బాగా ఆడుతున్న ఆటగాడు కీలక మ్యాచ్ లో విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే నా దృష్టిలో కోహ్లీ ప్రమాదకర ప్లేయర్, ఆ తర్వాత రోహిత్ శర్మ” అంటూ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news