Mega154 నుంచి టైటిల్‌ టీజర్‌ ప్రోమో..మెగా ఫ్యాన్స్‌ కు జాతరే

-

మెగా స్టార్‌ చిరంజీవి..ప్రస్తుతం చేస్తున్న సినిమా మెగాస్టార్ 154. ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ ను రేపు ఉదయం 11.07 AM గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ఓ ప్రోమో రిలీజ్‌ చేశారు. ఇక ఇందులో చిరు లుక్‌ కనిపించకపోయినా.. ఆయన సిగరేటు తాగుతూ కనిపించారు. ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news