World Cup 2023 : బీసీసీఐ ఈవెంట్ లా ఉంది.. పాక్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

-

World Cup 2023 : భారత్‌తో మ్యాచ్ తరుణంలో.. పాక్ కోచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం పాక్ కోచ్ మిక్కి ఆర్థర్ సంచలన వాక్యాలు చేశారు. నిన్నటి మ్యాచ్ ఐసీసీ ఈవెంట్ ల కనిపించలేదని, బీసీసీఐ ఈవెంట్ ల ఉందని అన్నారు. మైక్రోఫోన్ల ద్వారా ‘దిల్ దిల్ పాకిస్తాన్’ కూడా తనకు వినబడలేదని చెప్పారు.

Pakistan's Coach Made Cheap Comments Against The BCCI
Pakistan’s Coach Made Cheap Comments Against The BCCI

ఏకపక్షంగా ప్రేక్షకులు ఉండటాన్ని తాను సాకుగా చూపించట్లేదని… అయితే ఇది మ్యాచ్ పై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. WC ఫైనల్లో భారత్, పాక్ తలపడాలని చూస్తున్నానన్నారు. ఇది ఇలా ఉండగా, PAKతో హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపాడు.

పెసర్ షాహిన్ ఆఫ్రిది బౌలింగ్ లో తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ కు అంపైర్ ఎరాస్మస్ ఆశ్చర్యపోయారు. అలా ఎలా కొడుతున్నావని అడగ్గా…. రోహిత్ నవ్వుతూ బైసెప్స్(కండలు) చూపించాడు. మ్యాచ్ తర్వాత రోహిత్ దీనిపై స్పందించాడు. ‘అంత ఈజీగా ఎలా సిక్సర్ కొట్టావని ఎంపైర్ అడిగాడు. బ్యాట్ పవరా అని అంటే…. కాదు నా పవర్ అని చెప్పా’ అని రోహిత్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news