‘హాయ్‌ నాన్న’ టీజర్‌ వచ్చేసింది.. హార్ట్ టచింగ్​గా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్

-

నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ సీత.. మృణాల్ ఠాకూర్.. జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. బేబీ కియారా ఖన్నా.. శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్.. పాటలు రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సరదాగా సాగుతోన్న తండ్రీ కుమార్తెల జీవితంలోకి ఒక అమ్మాయి రావడం.. అతడితో ఆమె ప్రేమలోపడటం.. ఇలా డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందించినట్లు టీజర్​ చూస్తే అర్థమవుతోంది. ఆమె ప్రేమను అతడు అంగీకరించాడా? తన కుమార్తె కోసం అతడు ఏం చేశాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ టీజర్​లో నాని, మృణాల్​ల కెమిస్ట్రీ చాలా అందంగా కనిపిస్తోంది. మరోవైపు నాని-కియార మధ్య వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఆకట్టుకున్నాయి. వైరా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై రూపొందుతున్నఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news