Asia Cup 2023 : భారత్, పాక్ మ్యాచుకు వర్షం ముప్పు!

-

Asia Cup 2023 : భారత్, పాక్ మ్యాచుకు ఊహించని షాక్ తగిలింది.  ఆసియా కప్-2023లో భాగంగా సెప్టెంబర్ 2న జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మ్యాచ్ పల్లెకేలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా, అక్కడ శనివారం 90% వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణంలో 84% తేమ ఉంటుందని తెలిపింది. దీంతో ఈ రసవత్తరమైన పోరు వర్షార్పణం అవుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇది ఇలా ఉండగా, అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఆడే మ్యాచ్ల టికెట్లను BCCI విడుదల చేయనుంది.అక్టోబర్ 8న భారత్-ఆస్ట్రేలియా (చెన్నై), అక్టోబర్ 11న భారత్-ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ), అక్టోబర్ 19న భారత్-బంగ్లాదేశ్ పూణే మ్యాచ్ టికెట్లు ఇవాళ రాత్రి 8 గంటలకు రిలీజ్ అవుతాయి. tickets.cricketworldcup.com వెబ్సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news