టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ను ఓ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుకు సురేష్ రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, జమైకా స్ప్రింటర్ పోవల్ , డచ్ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్స్ సహా 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీ పడ్డారు. ఈ అవార్డును బంగ్లాదేశ్ క్రీడా మంత్రి జహీర్ హసన్ సురేష్ రైనాకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా మరియు మాల్దీవుల క్రీడా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ మెగా వేలం లో సురేష్ రైనాను ఏ ప్రంచసి కూడా కొనుగోలు చేయని విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ఐపీఎల్ కప్ గెలవడంలో సురేష్ రైనా కీలక పాత్ర వహించాడు. మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్నాడు సురేషన్ రైనా.. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున 176 మ్యాచ్లు ఆడిన సురేష్ రైనా ఏకంగా నలభై ఆరు వందల 77 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు.