ఇంగ్లాండ్ కోచ్ కోసం బ్రెండన్ మెక్ కలమ్ కన్నా ముందు నన్నే అడిగారు: పాంటింగ్

-

ప్రస్తుతం ఇంగ్లాండ్ పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్ గా మాజీ న్యూజిలాండ్ కెప్టెన్ మరియు ఆటగాడు బృందం మెక్ కలం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతని సారథ్యంలో ఇంగ్లాండ్ కీలకమైన విజయాలను అందుకుంటూ దూసుకువెళుతోంది. అయితే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా ఎవరు అయితే బాగుంటుంది అన్న విషయంపై గతంలో జరిగిన ఒక చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ జట్టుకు కోచ్ గా మొదటగా నన్నే సంప్రదించారని అసలు విషయం బయటపెట్టాడు. అప్పట్లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రాబ్ కీ స్వయంగా పాంటింగ్ దగ్గరకు వచ్చి కోచ్ గా ఉంటారా అని అడిగాడట.

 

ఆ సమయంలో నేను కోచ్ గా చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో తిరస్కరించినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ఆఫర్ బృందం మెక్ కలం వద్దకు వెళ్ళింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news