వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయని, కానీ ఈ సారి అలా జరగకూడదని కాబట్టి పొత్తు తప్పనిసరి రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. పొత్తు ఖాయం చేసుకున్నారు. ప్రస్తుతానికి ఎవరికి వారు సొంతంగా ముందుకెళుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది.
అయితే పొత్తు ఉంటే వైసీపీకి చెక్ పెట్టవచ్చు అనేది టిడిపి, జనసేన భావన..కానీ ఇక్కడే భారీ ట్విస్ట్ ఉంది. పొత్తుకు షాక్ తగిలేలా ఉంది. పొత్తులో ఓట్లు బదిలీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి ఓట్లు..పెద్ద స్థాయిలో జనసేనకు షిఫ్ట్ అవ్వడం జరిగే పని కాదని తెలుస్తుంది. గతంలో అలా జరగాక పొత్తులు విఫలమయ్యాయి. 2009లో టిడిపి..టిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది.
ఆ మూడు పార్టీల కంటే టిడిపి పెద్ద పార్టీ..అన్నీ స్థానాల్లో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. కానీ పొత్తులో టిఆర్‌ఎస్ పోటీ చేసిన సీట్లలో టిడిపి ఓట్లు బదిలీ కాలేదు. దీంతో టిఆర్‌ఎస్ పలు సీట్లలో ఓడింది. ఇది పొత్తుపై పడి టిడిపికి దారుణంమైన ఓటమి వచ్చింది. వాస్తవానికి 2014లో కూడా పొత్తులో ఓట్లు బదిలీ కాలేదు. టిడిపి, బిజేపి పొత్తు పెట్టుకున్నాయి. బిజేపి కొన్ని సీట్లు ఇస్తే..ఆ పార్టీ నాలుగు సీట్లే గెలిచింది. మిగతా సీట్లలో టిడిపి ఓట్లు బిజేపికి పడలేదు.
కాకపోతే అప్పుడు జనసేన పోటీ చేయకుండా మద్ధతు ఇవ్వడం..టిడిపి-బిజేపికి కలిసొచ్చింది. ఇప్పుడు టిడిపి, జనసేన కలుస్తున్నాయి..కుదిరితే బిజేపి కలుస్తుంది. అయితే బిజేపి పొత్తులో ఉంటే ఆ పార్టీకి టిడిపి ఓట్లు పెద్దగా బదిలీ కావు. జనసేన పరిస్తితి అంతే..రాష్ట్రంలో 175 స్థానాల్లో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. జనసేనకు అలా లేదు.
అయితే టిడిపి పోటీ చేసే సీట్లలో జనసేన ఓట్లు ఓ 10 వేల వరకు బదిలీ అయిన చాలు. కానీ జనసేనకు ఇచ్చే సీట్లలో టిడిపి ఓట్లు 30 వేలు, 40 వేలు, 50 వేలు బదిలీ కావాలంటే జరిగే పని కాదు. ఉదాహరణకు పిఠాపురం సీటు ఉంది..పొత్తు ఉంటే ఈ సీటు తమకే అని జనసేన అంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి 82 వేలు, టిడిపికి 68 వేలు, జనసేనకు 28 వేల ఓట్లు పడ్డాయి. ఇక జనసేనకు సీటు ఇస్తే టిడిపికి ఉన్న 68 వేలు షిఫ్ట్ అవ్వాలి. అదే జరిగే పనేనా అంటే డౌటే. కాబట్టి పొత్తు ఫెయిల్ అయ్యి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది.