ఐపీఎల్ 2023 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయాన్ని సాధించింది . గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది కేకేఆర్. కేవలం ఆరు బంతుల్లోనే 31 పరుగులు కావాల్సిన సమయం లో చివరి ఓవర్‌లో రింకు విశ్వరూపం ఎత్తాడు. ఏకంగా 5 సిక్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించాడు రింకు.
అయితే ఈ మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగ్ పేరు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. కానీ క్రికెట్ లోకి వచ్చే క్రమంలో రింకు సింగ్ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు అని తెలుస్తోంది. యూపీలోని నిరుపేద కుటుంబానికి చెందిన రింకు… ఒకానొక దశలో స్వీపర్ గాను పనిచేశాడట. ఆ పని చేస్తూనే క్రికెట్ శిక్షణకు వెళ్లేవాడు. ఈ తరుణంలోనే కేకేఆర్ జట్టులోకి రింకు సింగ్ వచ్చాడు. ఇప్పుడు అద్భుతమైన ప్రదర్శన కూడా కనబరుస్తున్నాడు రింకు. కాగా 2018లో కేకేఆర్ తరఫున అరెంగ్రీటం చేసిన రింకు… నిన్నటి మ్యాచ్ లో 21 బంతుల్లో 48 రన్స్ చేసి… ధోని రికార్డును కూడా బ్రేక్ చేశాడు.