Rinku Singh : టీమిండియా హిట్టర్ రింకు సింగ్ గురించి తెలియని వారుండరు. రింకు సింగ్ భారత క్రికెట్ లో సంచలనం. పేద కుటుంబం నుంచి వచ్చి తన కలను నెరవేర్చుకున్నారు. అతని తండ్రి ఖన్ చంద్ర సింగ్ ఎల్పీజీ గ్యాస్ ను డెలివరీ చేస్తూ తన ఐదుగురు పిల్లలను పెద్ద చేశారు. మూడో కుమారుడైన రింకూ స్టార్ క్రికెటర్ గా ఎదిగి భారత జట్టుకు ఆడుతున్నారు అయితే రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్ లను డెలివరీ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
రింకూ జీవితం స్ఫూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, తిలక్ వర్మ, రింకు సింగ్ లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఇంగ్లాండ్ లయన్స్ తో ఆఖరి రెండు మ్యాచ్ లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారధ్యంలో లయన్స్ తో పోటీపడనున్న ఈ టీంలో తిలక్ వర్మ, రింకు సింగ్ లకు కూడా చోటు దక్కింది.