Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. అతను వచ్చేస్తున్నాడు

-

Rishabh Pant: టీం ఇండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నెట్స్ లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్ కు దూరం అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ కు, ఆ తర్వాత టీం ఇండియాలో రానున్నారు. కాగా, తన రికవరీ గురించి పంత్ ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

Rishabh Pant’s big milestone yet in road to recovery From walking with crutches to running on field

కాగా, ఢిల్లీ క్యాపిటల్ కోచ్ రికీ పాంటింగ్ తమ కెప్టెన్ రిషబ్ పంత్ పునరాగమనం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కి పంత్ పూర్తిగా అందుబాటులో ఉండాలని కోరుకుంటూనే.. అతని రీ ఎంట్రీ పై ఇప్పుడే ఏమి చెప్పలేనని బాంబు పేల్చాడు. రీ ఎంట్రీ పై పంత్ ను అడిగితే మాత్రం అన్ని మ్యాచ్ లకు సై అంటాడని.. వికెట్ కీపింగ్ విషయంలో తగ్గేదే లేదని అంటాడని.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి దిగుతానని ధీమాగా చెబుతాడని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version