నిన్న రాత్రి వరల్డ్ కప్ లో భాగంగా ఆసియా దేశాలు అయిన శ్రీలంక మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ చేధించని అత్యధిక టార్గెట్ ను ఛేదించి రికార్డ్ సృష్టించింది. శ్రీలంక నిర్దేశించిన 345 పరుగుల టార్గెట్ ను కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇందులో అబ్దుల్ షఫీక్ (113) మరియు మహమ్మద్ రిజ్వాన్ (131*) లు సెంచరీ లు సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ముఖ్యంగా రిజ్వాన్ పరిస్థితులకు తగినట్లు ఆడిన తీరు, ఆటపట్ల అతనికి ఉన్న నిబద్దత పై ఎందరో తమ అభిమానులుగా మారారు. ఒకవైపు కాలు నొప్పి తీవ్రంగా వేధిస్తున్న తొణకక, బెణకక చివరి వరకు క్రీజులో నిలబడి పాకిస్తాన్ కు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ తో రిజ్వాన్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్పాలి.
ఆ పరిస్థితుల్లో ఎవ్వరైనా రిటైర్డ్ హర్ట్ గా వెళ్లిపోవడం మనము చూశాము. కానీ రిజ్వాన్ ది ట్రూ ఫైటర్ గా పేరుతెచ్చుకున్నాడు.. ఇతను ఇదే ఫామ్ లో ఉంటే చాలా అవలీలగా పాకిస్తాన్ వరల్డ్ కప్ ను గెలుస్తుంది.