రోహిత్ శర్మ డబుల్ సెంచరీ… ఆ వెంటనే..

-

సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజుకు చేరుకుంది. మొద‌ట టీమింయాకు ఎదురు దెబ్బ త‌గిలినా.. ఆ త‌ర్వాత భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. మూడో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ, అద్భుత రీతిలో ఆడి, డబుల్ సెంచరీ సాధించాడు. లంచ్ విరామానికి 199 పరుగులతో క్రీజులో నిలిచిన రోహిత్, లంచ్ తరువాత 200 పరుగుల మార్క్ ను చేరుకునేందుకు పెద్దగా కష్టపడలేదు. 249 బంతులను ఆడిన రోహిత్ సిక్స్ తో 200 పరుగులను దాటాడు. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డును రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాపై ఒక ద్వైపాక్షిక సిరీస్‌ లో రెండుసార్లు 150కిపైగా పరుగులు సాధించిన తొలి ఓపెనర్‌ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు ఈ ఫీట్ సాధించిన ఎనిమిదో క్రికెటర్‌ గానూ నిలిచాడు. ప్రస్తుతం భారత స్కోరు 88.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు కాగా, జడేజా 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ శర్మ 212 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రబాడా బౌలింగ్ లో బౌండరీ లైన్ వద్ద ఉన్న ఎంగిడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news