టీమిండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ రిటైర్మెంట్..

-

టీమిండియా వివాదస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తన ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాడు. యువ క్రికెటర్లకు అవకాశం కల్పించేందుకు తాను ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. సరైన సమయంలో క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నానని.. ఈ నిర్ణయం తాను సొంతంగానే తీసుకున్నానని ప్రకటన చేశారు. క్రికెట్‌ లో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని.. రిటైర్మెంట్‌ నిర్ణయం తనకు వ్యక్తిగతంగా బాధాకరమైన విషయం అన్నారు.

” ఎంతో భారమైన హృదయంతో క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నాను. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులకు అలాగే సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు. ఫస్ట్క్లాస్ క్రికెట్ తో పాటు అన్ని ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్న. ఐసీసీ నాకు ఎంతో గౌరవం ఇచ్చింది. నా 25 సంవత్సరాల కెరీర్ లో క్రికెట్ ఎంతో ఆస్వాదించాను.” అంటూ శ్రీశాంత్ చేశారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి నెలలో జరిగిన ఐపీఎల్ వేలం లో శ్రీశాంత్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news