నా హార్ట్‌రేట్‌ పెరిగిపోయింది.. టీమిండియా విజయంపై ఎంఎస్ ధోనీ రియాక్షన్

-

2007లో ఎంఎస్‌ ధోనీ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్‌ను నెగ్గిన తర్వాత భారత్‌కు రెండో కప్‌ దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్‌ కెప్టెన్సీలో పొట్టి కప్‌ను టీమ్ఇండియా ముద్దాడింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందించారు.

‘‘ప్రతి స్టార్‌ భారత్‌ విజయం సాధించడంలో కృషి చేశారు. జెర్సీని చూసి దేశం గర్వపడేలా చేశారు. పిల్లలు కూడా తాము క్రికెటర్లం కావాలనే కలకు ముందడుగు వేసేలా ఈ విజయం చరిత్రలో నిలుస్తుంది. భారత్‌ నాలుగో స్టార్‌ను సాధించింది. రెండో టీ20 ప్రపంచ కప్‌ను సాధించడం అభినందనీయం. విండీస్‌లో 2007లో వన్డే ప్రపంచ కప్‌లో వైఫల్యంతో ఒడిదొడుకులను చూసిన భారత క్రికెట్‌ 2024 పొట్టి కప్‌ను గెలవడంతో పవర్‌హౌస్‌గా మారింది. నా స్నేహితుడు ద్రవిడ్‌ నేతృత్వంలో కప్‌ను చేజిక్కించుకోవడం ఆనందంగా ఉంది’’ అని సచిన్‌ టెండుల్కర్ పోస్టు చేశాడు.

 

‘‘వరల్డ్‌ కప్‌ 2024 ఛాంపియన్స్‌. ఈ మ్యాచ్‌ సమయంలో నా హార్ట్‌ రేట్‌ పెరిగిపోయింది. నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి కుర్రాళ్ల నుంచి ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్‌ కప్‌ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీలవుతాడు. కంగ్రాట్స్‌ బాయ్స్‌. విలువ కట్టలేని బహుమతిని పుట్టిన రోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ పోస్టు పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version