బర్త్ డే స్పెషల్ : నిరాడంబరత – నిబ్బరం – నెమ్మది – సచిన్ ‘దేవుడు’ అవడానికి కారణాలు !

-

భారత్ క్రికెట్ ప్రేమికుల ఆరాధ్య దేవుడు సచిన్ టెండూల్కర్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు కావటంతో లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో సచిన్ ఫోటోలతో పుట్టినరోజు శుభాకాంక్షలతో రచ్చ రచ్చ జరుగుతోంది. మొట్టమొదటిసారి సచిన్ గ్రౌండ్ లో అడుగు పెట్టిన టైమ్ లో అందరూ ఆశ్చర్యపోయారు. అది 1989లో భారత్ మరియు పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సందర్భం. భారత్ జట్టు బ్యాటింగ్ కావటంతో 16 సంవత్సరాల కుర్రోడు బ్యాట్ పట్టుకొని చాలా కూల్ గా వస్తున్నాడు. నూనుగు మీసాలు కూడా లేవు ఇంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ లో కి ఎలా వచ్చాడు అని అందరూ ఆలోచనలో పడ్డారు సచిన్ నీ చూసి.ICC Hall of Fame: Sachin Tendulkar అలా అడుగు పెట్టిన సచిన్ టెండూల్కర్ తన కెరియర్ ప్రయాణంలో అనేక రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్నాడు. అదేసమయంలో కోట్లల్లో అభిమానులను సొంతం చేసుకుని భారత్ క్రికెట్ ప్రేమికులకు దేవుడు అయ్యాడు. ఒకానొక సమయంలో ఇండియా టీం గురించి ప్రత్యర్థులు మాట్లాడుకోవాలంటే..ఎక్కువగా సచిన గురించే మాట్లాడుకునేవారు. అతన్ని అవుట్ చేస్తే చాలు మనం ఇండియా పై గెలిచేసినట్టే అని ప్రత్యర్థులు ఆ టైంలో డిసైడ్ అయ్యేవారట. ఎలాంటి పొజిషన్ వచ్చిన చాలా నిరాడంబరంగా ఉండటం సచిన్ కే చెందుతుందని చాలామంది క్రికెట్ ఆటగాళ్లు ప్రపంచ స్థాయిలో ఉన్న వాళ్లు కూడా అంటారు.

 

ప్రత్యర్థులు తనను ఎంతగా ఇబ్బంది పెట్టిన ఎక్కడ నోరు జారకుండా తన బ్యాట్ తో మాత్రమే సచిన్ సమాధానం చెబుతారని ఇంటర్నేషనల్ క్రికెటర్ లు చెబుతుంటారు.  క్రికెట్ ఆటలో సచిన్ లాగా మరొక క్రికెటర్‌ని చూడటం ఈ రోజుల్లో అసంభవమని కూడా అంటుంటారు. ముఖ్యంగా వ్యక్తిత్వంలో సచిన్ చాలా కూల్ గా వ్యవహరించడం వల్లే భారతీయ క్రికెట్ ప్రేమికులకు దేవుడు అవ్వడానికి కారణం అని క్రికెట్ విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం మైదానంలో కనబడుతున్న ఇండియా ఆటగాళ్లు ఎవరికి వాళ్ళు తమ టెంపర్ తనాన్ని చూపించడానికి ఎక్కువ ఇష్టపడతారు, దేశం గురించి కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం అన్నట్టు ఆడతారు.. ఇలాంటి ఆటగాళ్లు సచిన్ నుండి చాలా నేర్చుకోవాలని తెలియజేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news