సానియా మీర్జా ఓ సంచలనం.. మ‌హిళ‌ల టెన్నిస్‌కు ఆమె దిక్సూచి

-

సానియా మీర్జా గురించి తెలియని వాళ్ళు ఉండరు. టెన్నిస్ క్రీడాకారిణిగా ఎంతగానో పాపులర్ అయ్యింది సానియా. స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి అద్భుతమైన క్రీడాకారిణులపై విజయాల్ని అందుకుంది.

Sania Mirza | సానియా మీర్జా
Sania Mirza | సానియా మీర్జా

నిజంగా ఈమె ఆటకి, ఈమె పడ్డ కృషికి ఎంత మెచ్చుకున్నా తక్కువే. 2007లో సింగిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచింది సానియా. ఇలా ఎన్నో రికార్డులు, విజయాలు సానియా మీర్జా కెరీర్ లో వున్నాయి. మరి ఈ క్రీడాకారిణికి సంబంధించి ఎన్నో విషయాలని మనం ఇప్పుడే తెలుసుకుందాం. ఇక పూర్తి వివరాలలోకి వెళ్ళిపోతే..

సానియా మీర్జా కుటుంబం:

సానియా మీర్జా 1986 నవంబరు 15లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా, తల్లి నసీమా. ఈమె జన్మించిన కొత్త కాలానికే వీళ్ళు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. సానియా తన ఆరవ ఏటనే టెన్నిస్ ఆడటం మొదలు పెట్టారు.

Sania Mirza Childhood Mirza Photos
Sania Mirza Childhood Mirza Photos

సానియాకి 2008 డిసెంబరు 11న చెన్నైలో ఎం.జి.ఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్సిటిట్యూట్ ఆమెకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ విభాగంలో డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. అలానే సానియా స్విమ్మింగ్ లో కూడా ప్రావిణ్యురాలు.

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో సానియా 12 ఏప్రిల్ 2010 న షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకుంది.

సానియా మీర్జా అందుకున్న విజయాలు:

2001లో పూణేలో క్వార్టర్ ఫైనల్స్ లోనూ, ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ గెలుపొందారు. 2002లో మొదట అపజాయాలు ఆమెకి ఎదురయ్యినా హైదరాబాద్, ఫిలిప్పీన్స్, మనీలాలోనూ ఆమె వరుసగా మూడు టైటిల్స్ ని గెలుచుకోవడం జరిగింది.

2002 యూఎస్ ఓపెన్ బాలికల డబుల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కి సానియా చేరుకోవడం జరిగింది.
15 ఏళ్ల సానియా పుణేలో క్వార్టర్ ఫైనల్స్ లో, ఢిల్లీలో ఆడిన సెమీ ఫైనల్స్ లోనూ ఎంతో గొప్పగా ఆడింది.
వైల్డ్ కార్డ్ నుండి ఎపి పర్యాటక శాఖ హైదరాబాదు ఓపెన్ పోటీల్లో మొదటి రౌండులో వరుస విజయాలని ఇచ్చి ఆస్ట్రిలియన్ ప్లేయర్ చేతిలో ఊడిపోవడం జరిగింది. 2002 లో Busan లో జరిగిన ఆసియన్ గేమ్స్ లో Leander peas తో బ్రాంజ్ మెడల్ పొందారు.

2004లో 6 ఐటిఎఫ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. అలానే 2005లో ఆస్ట్రేలియా ఓపెన్ లో కిండీ వాట్ సన్, పెట్రా మాండులా లను మొదటి, రెండవ రౌండ్లలో ఓడించి, మూడవ రౌండుకు చేరుకున్నారు.

2005 లో అయితే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్స్ లో యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ని ఓడించారు. అలానే లూసి సఫరోవాతో గెలిచి 2005 యూఎస్ ఓపెన్ లో గ్రాండ్ స్లాం టోర్నమెంట్ లో నాల్గవ రౌండుకు చేరిన మొదటి భారత మహిళగా నిలిచారు. 2003 ఆస్ట్రో ఆఫ్రికన్ గేమ్స్ లో నాలుగు బంగారు పతకాలని సొంత చేసుకోవడము జరిగింది.

అలానే సానియా 2005లో ఆస్ట్రేలియా ఓపెన్ లో కిండీ వాట్ సన్ పెట్రా మాండులాలను మొదటి, రెండవ రౌండ్లలో ఓడించి, మూడవ రౌండుకు చేరుకున్నారు సానియా. సెరీనా విలియమ్స్ చేతిలో మూడవ రౌండులో ఓడిపోయారు.

2005 ఎపి పర్యాటక శాఖ హైదరాబాద్ ఓపెన్ లో చివరి రౌండులో ఎలోనా బొన్డారెన్కో పై గెలిచి డబ్ల్యూటిఎ టైటిల్ గెలిచిన మొదటి భారత మహిళగా నిలిచారు సానియా.

2006 ఆస్ట్రేలియా ఓపెన్ ప్రవేశంతో గ్రాండ్ స్లమ్ ఈవెంట్ లో ఆడిన మొదటి భారత మహిళగా గుర్తింపు తెచ్చుకుంది సానియా. మిచెల్ క్రాజిక్ తో ఆడి ఓడిన ఆమె బెంగళూరు ఒపెన్ లో హ్యూబర్ తో కలసి కామిలీ పిన్ పై గెలిచి డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు.

Sania Mirza At The Doha Asian Games
Sania Mirza At The Doha Asian Games

డోహా ఆసియా క్రీడల్లో మూడు పతకాలను గెలుచుకున్నారు. ఉమెన్స్ డబుల్స్ లో బంగారు పతకం, మహిళల సింగిల్స్ లో వెండి పతకాన్ని గెల్చుకున్నారు. 2006లో స్వెట్లనా కుజ్నెట్సోవా, నాడియా పెట్రోవా, మార్టినా హింగిస్ లపై వరుసగా 10 విజయాలు సాధించారు.

అదే విధంగా పాటియాలో జరిగిన 2007 ఆస్ట్రేలియా ఓపెన్ లో సెమీఫైనల్స్ కి ఆమె చేరడంతో పాటు, బెంగళూరు టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్స్ లోకి చేరి 2007ను మంచి విజయాలతో మొదలు పెట్టారు ఆమె. 2007 యూఎస్ ఓపెన్ సిరీస్ లో 8వ స్థానం దక్కించుకోవడంతో సానియా సింగిల్స్ లో ప్రపంచ 27వ నెంబర్ ర్యాంకు లో నిలిచారు.

2007 యూఎస్ ఓపెన్ లో అన్నా చక్వతడ్జే పై గెలిచి మూడోసారి మూడవ రౌండుకు చేరుకుని రికార్డు సృష్టించారు. అలానే డబుల్స్ లో మహేష్ భూపతి తో కలసి క్వార్టర్ ఫైనల్స్, మహిళల డబుల్స్ లో బెతనే మాటెక్ తో కలసి ఆడి క్వార్టర్ ఫైనల్స్ కి సానియా చేరారు. 2007లో నాలుగు డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు సానియా.

2008 సమ్మర్ ఒలంపిక్స్ లో సానియా భారత్ తరఫున ఆడగా… ఈ పోటీలో ఇవెటా బెనెసోవాతో ఓడిపోయారు సానియా. ఒలంపిక్స్ లో కుడిచేతికి దెబ్బ తగలడం వల్ల ఆమె సింగిల్స్ లో ఆడే అవకాశంని కూడా కోల్పోయారు.

అక్టోబరులో 2010 కామన్ వెల్స్ ఆటల్లో భారత్ తరఫున ఆడిన సానియా బ్రిటానీ టీయి (కూక్ దీవులు), మరీన ఎరెకోవిక్ (న్యూజిలాండ్), ఓలివియా (ఆస్ట్రేలియా) లను ఓడించి ఫైనల్స్ కు చేరారు. ఫైనల్స్ లో ఆమె రన్నర్ గా నిలిచారు.

2010 ఆసియన్ గేమ్స్ లో విష్ణు వర్ధన్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో సానియా ఆడి బ్రాంజ్ మెడల్ పొందారు. 2012 జూన్ 7న మహేష్ భూపతి తో కలసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో గెలుపొందారు.

నవంబరులో 2010 ఏషియన్ గేమ్స్ లో భారత్ తరఫున ఆడారు సానియా. మొదటి రౌండులో చాన్ వింగ్ యాయును, జాంగ్ షుయాయ్ లను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. ఇలా దీనిలో ఆమె కాంస్యం సాధించారు.

2014 లో తెలంగాణ ప్రభత్వం సానియాని స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చెయ్యడం జరిగింది. ఇదే సంవత్సరం ఆమెని సౌత్ ఏసియా కి UN Good Will Ambassador గా అపాయింట్ చేసారు.

2015 లో సానియా మార్టినా తో కలిసి ఫామిలీ సర్కిల్ కప్ వంటి ఎన్నో విజయాల్ని అందుకున్నారు.

సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్ 2015 వింబుల్డన్ మరియు 2015 యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారు.

ఆగస్టు 2016 మార్టినా హింగిస్ మరియు సానియా టీమ్ విడిపోవాలని అనుకున్నారు. కానీ వాళ్ళు మంచి స్నేహితులే ఇంకా. ఆ తర్వాత మార్టినా హింగిస్ కి కమిటెడ్ పార్ట్నర్ కోసం కష్టపడింది.

2016 లో సానియా 100 Influential people లిస్ట్ లో వుంది.

2016 జులైలో సానియా ”Ace Against Odds” అనే పుస్తకాన్ని ప్రచురించుకోవడం జరిగింది.

2018 లో మోకాళ్ళు ఇబ్బంది వలన కొన్ని టోర్నమెంట్స్ మిస్ అయ్యింది.

ఏప్రిల్ 2018 లో సానియా గర్భిణీ అని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

అక్టోబర్ 2018 సానియా ఇజ్హాన్ కి జన్మించ్చింది.

జనవరి 2020 42 వ WTA డబుల్స్ టైటిల్ ని హోబార్త్ ఇంటెర్నేషన్ లో పొందింది.

జులై 2021 UAE అఫీషియల్ గా సానియాకి దుబాయ్ గోల్డెన్ వీసాని ఇచ్చింది. షారుఖ్ ఖాన్,సంజయ్ దత్ తర్వాత దుబాయ్ గోల్డెన్ వీసాని పొందిన ఇండియన్ సానియానే.

డిసెంబరులో, దుబాయ్ ఆల్ హబ్టూర్ టెన్నిస్ ఛాలెంజ్ లో క్సెనియా పెర్వక్, జులియా జార్జస్, ఎవ్జెనియా రోడినా, బోజానా జొవెనొస్కిలను ఓడించి టోర్నమెంట్ గెలుచుకున్నారు సానియా. ఇలా సానియా ఎన్నో గెలుపోటములని తన కెరీర్ లో చూడడం జరిగింది.

సానియా మీర్జా అందుకున్న అతి పెద్ద విజయాలు, అవార్డులు, రికార్డులు:

భారత అథ్లెట్ సానియా మల్టీ-స్పోర్ట్స్ ఈవెంట్లలో 14 పతకాలు సాధించింది. వీటిలో ఆరు బంగారు పతకాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మీర్జా ఏ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించలేదు. అందుకే 2020 టోక్యో క్రీడలను లక్ష్యంగా చేసుకుంది.

sania mirza received rajiv gandhi khel ratna award
sania mirza received rajiv gandhi khel ratna award

సానియాని 2004 లో అర్జున అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆ తరువాత 2006 లో పద్మశ్రీని పొందింది. 2015 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. 2016 లో పద్మ భూషణ్ అవార్డును కూడా అందుకుంది.

Sania Mirza Receiving Padma Bhushan Award
Sania Mirza Receiving Padma Bhushan Award

సానియా ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను రెండు సార్లు గెలుచుకుంది. డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక మహిళా భారతీయ క్రీడాకారిణి కూడా సోనియానే.

Sania Mirza and mahesh bhupathi after winning the 2012 french open in mixed doubles
Sania Mirza and mahesh bhupathi after winning the 2012 french open in mixed doubles

మహేష్ భూపతి, సానియా మీర్జా 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. వీరు 2012 లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి వారి రెండవ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకుంది. బ్రూనో సోరెస్‌తో 2014 యుఎస్ ఓపెన్‌ను గెలుచుకోవడం ద్వారా సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడో గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది.

Sania Mirza no 1 wta ranking with martina hingis
Sania Mirza no 1 wta ranking with martina hingis

సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్ 2015 వింబుల్డన్ మరియు 2015 యుఎస్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నారు. 2016 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయంతో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news