తిరుపతిలో లారీ బీభత్సం… ఈ ప్రమాదంలో…!

చిత్తూరు: తిరుపతిలో లారీ బీభత్సం సృష్టించింది. వడమాలపేట అంజేరమ్మ గుడి వద్ద పాదాచారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులు తిరుమలకు కాలినడక వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీని వదిలి డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు. మృతుడితో పాటు క్షతగ్రాతులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు చెన్నైకు చెందినవారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

రోడ్డుప్రమాదాలపై వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రోడ్డు సేఫ్టీపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని తెలిపారు. కుటంబాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.