Afghanistan:ఆఫ్ఘనిస్తాన్ లో కుప్పకూలిన విమానం…

-

అఫ్గానిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.మాస్కో వెళ్తున్న భారత విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని జెబాక్ జిల్లా బదాక్షన్ ప్రావిన్స్లోని తోపఖానా కొండల్లో ప్రమాదానికి గురైనట్లు ఆఫ్ఘన్ మీడియా వెల్లడించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని బదక్షన్‌లోని తాలిబాన్ సమాచార , సంస్కృతి మంత్రి ఈ సంఘటనను ధృవీకరించారు. ప్రావిన్స్‌లోని కరణ్, మంజన్, జిబాక్ జిల్లాల్లో విస్తరించి ఉన్న తోప్‌ఖానే కొండల్లో ప్రయాణీకుల విమానం కూలిపోయిందని తెలిపారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంత మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారనే సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అధికారిక వర్గాలు ప్రాణనష్టంకి సంబంధించిన వివరాలను గాని ప్రమాదానికి సంబంధించిన కారణాలు గాని ఇంకా తెలియపరచలేదు.

 

 

కూలిపోయిన విమానం చార్టర్ విమానం అని సమాచారం. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ప్రమాదంపై దర్యాప్తు చేయబడుతోంది. కుప్పకూలిన విమానం ఇండియా లో రిజిస్టర్ చేయబడలేదని MoCA , DGCA వర్గాలు వెల్లడించారు. విమానం రష్యాలో రిజిస్టర్ అయినట్లు సమాచారం. ఏ ఇండియా విమానయాన సంస్థలోనూ రష్యా రిజిస్టర్డ్ విమానాలు లేవు.

Read more RELATED
Recommended to you

Latest news