ఇకపై కొడుకు పేరుతో ఉన్న జర్సీతోనే ఐపీఎల్ బరిలోకి ధావన్ ?

-

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్‌లో పంజాబ్ ఫ్రాంచైజీకి ఆడుతున్న ధావన్ తన కొడుకు పేరుతో జెర్సీ రెడీ చేయించాడు. నెం.1 ZORAVER పేరున్న ఆ జెర్సీని ధరించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావ్ (You’re Always with Me, My Boy) అంటూ కామెంట్ పెట్టాడు. ఈ జెర్సీతోనే ధావన్ నెక్ట్స్ మ్యాచ్ల్లో బరిలోకి దిగాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ధావన్, తన భార్యతో విడిపోయిన తర్వాత నుంచి కొడుకుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. పైగా అవన్నీ కొడుకుతో తాను చెప్పాలనుకున్న మాటలే అన్నట్లుగా ధావన్ పోస్టులు ఉంటున్నాయి. ఆయేషాతో విడిపోయిన తర్వాత ధావన్ తన కుమారుడికి దూరమైన విషయం తెలిసిందే. కొడుకే సర్వంగా గడిపేస్తున్న ధావన్ గతంలోనూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

‘మనం నేరుగా కలిసి ఏడాది కావొస్తుంది. గత మూడు నెలలుగా నీతో మాట్లాడనివ్వకుండా నన్ను అన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. నీతో నేరుగా మాట్లాడకపోయినప్పటికీ, టెలిపతితో ఎప్పుటికీ నీ మనసుకు దగ్గరగానే ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నిన్ను చూసి గర్విస్తున్నాను’ అని ధావన్ గతంలో పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

 

Read more RELATED
Recommended to you

Latest news