IPL 2024 : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ను ఆ జట్టు ఫ్రాంచైజీ నియమించింది. వైస్ కెప్టెన్ గా నితీష్ రాణాను ఎంపిక చేసింది. కాగా, గత సీజన్ లో కూడా KKR కెప్టెన్ గా అయ్యర్ నియమితులయ్యారు.

కానీ ఐపీఎల్ ఆరంభానికి ముందే అతడు గాయపడ్డారు. అనంతరం లండన్ లో సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. దీంతో అతడి స్థానంలో నితీష్ రాణాను ఆ జట్టు కెప్టెన్ గా నియమించింది.