తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ. 5.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆరోజు 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈనెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా, జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తిరుమలలో నేడు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ రద్దు కానుంది. అధ్యాయనోత్సవాల సందర్భంగా గరుడ వాహన సేవను రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో ప్రణయకలహ మహోత్సవం జరుగనుంది.