ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడాన్ని మాజీ క్రికెటర్ గవాస్కర్ సమర్ధించారు. “తప్పొప్పుల జోలికి మనం వెళ్లకూడదు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ముంబై చివరగా 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది.
నిరంతరంగా టోర్నీలు ఆడటం వల్ల రోహిత్ అలసిపోయి ఉండొచ్చు. గతేడాది గుజరాత్ కు పాండ్యా టైటిల్ అందించారు. అతని ద్వారా కొత్త ఉత్సాహం వస్తుందని ముంబై భావించింది” అని చెప్పుకొచ్చారు. కాగా….ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారమే రేపుతోంది. ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అందరిని షాక్ కు గురిచేసింది. ముంబై నిర్ణయాన్ని హిట్ మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐపీఎల్ టాస్ టైం లో రోహిత్ ను కెప్టెన్ గా చూడలేమంటూ ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. “గుండె రాయి చేసుకోక తప్పేలా లేదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.