IPL 2024 : పంజాబ్ ను మట్టికరిపించిన హైదరాబాద్…

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 64 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.

Sunrisers Hyderabad won by 2 runs

అటు హెడ్ 21 పరుగులు చేశాడు. అబ్దుల్ సమాద్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు… మొదట్లో తడబడి ఆ తర్వాత గెలుపు దిశగా పయనించింది. కానీ హైదరాబాద్ బౌలర్ల దాటికి 180 పరుగుల వద్ద ఆగిపోయింది పంజాబ్. దీంతో హైదరాబాద్ జట్టు రెండు పరుగులు తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news