ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరికొన్ని రోజులలో సార్వత్రిక ఎన్నికలు ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఇవాళ ఉగాది పండగ కావడంతో యాత్రకు ఈరోజు ఇచ్చారు. దీంతో మేమంతా సిద్ధం 12వ రోజు రేపటి (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైసీపీ రిలీజ్ చేసింది. ఈ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ( బుధవారం ) ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు.పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యా్హ్న భోజన విరామం తీసుకోనున్నారు. ఇక, ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా రేపు మధ్యాహ్నం 3. 30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని అనంతరం సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.సభ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.