PUSHPA : “శ్రీవల్లి” పాటకు చిందులేపిన సురేష్‌ రైనా..వీడియో వైరల్‌

అల్లు అర్జున్‌ తాజాగా నటించిన చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ పుష్ప సినిమా వరల్డ్‌ వైడ్‌ గా సక్సెస్‌ ఫుల్‌ గా నడుస్తోంది. ఊర మాస్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిన పుష్ప సినిమా లో ప్రతి పాటా ఓ సెన్సేషనల్‌ అయింది. ముఖ్యంగా శ్రీవల్లీ, ఊ అంటావా మావ పాటలు యూట్యూబ్‌ ను షేక్‌ చేసేస్తున్నాయి. ఈ రెండు పాటలకు ప్రతి ఒక్కరూ స్టెప్పులు వేస్తున్నారు.

మామాలు ప్రజల నుంచి.. సెలబ్రీటీల వరకు అందరూ ఈ పాటలకు ఫిదా అయిపోతున్నారు. అయితే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ ఐపీఎ్‌ సురేష్‌ రైనా పుష్ప సినిమాలోని శ్రీ వల్లీ పాటకు స్టెప్పులేశాడు. తన ఇంట్లో హిందీలో పాట ప్లే అవుతుండగా.. అల్లు అర్జున్‌ స్టెప్పులను రైనా వేశాడు. అచ్చం అల్లు అర్జున్‌ ను గుర్తు చేస్తూ.. అతని లానే పాదాలను కదలించిన రైనా.. తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. రైనాతో పాటు మరో ఇద్దరు కూడా డాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ అభిమాన ట్విట్టర్‌ లోపోస్ట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌ గా మారింది.