చంద్రబాబు అంతటి స్థాయిలో లోకేశ్ రాణించాలి అని కోరుకుంటున్న వారిలో ఇవాళ ఎందరో ఉన్నారు. ఓవైపు కేటీఆర్ కానీ మరోవైపు జగన్ కానీ ఇవాళ వారసత్వ రాజకీయాల్లో దూసుకుపోతున్న తరుణాన లోకేశ్ ఎందుకనో వెనుకబడి ఉన్నారు. ఆ బడిని వీడి పరుగులు తీస్తే విజయాలే!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. యువ నాయకుడిగా ప్రజలకు, సోదరుడిలా టీడీపీ కార్యకర్తలకు మీరు అండగా నిలుస్తున్న తీరు స్ఫూర్తిదాయకం.దేవుడు మీకు సుదీర్ఘమైన, సంతోషకరమైన , ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
.@naralokesh అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. యువ నాయకుడిగా ప్రజలకు, సోదరుడిలా టీడీపీ కార్యకర్తలకు మీరు అండగా నిలుస్తున్న తీరు స్ఫూర్తిదాయకం. దేవుడు మీకు సుదీర్ఘమైన, సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.#HBDNaraLokesh pic.twitter.com/i1W93TLVfL
— Ram Mohan Naidu #విశాఖఉక్కుఆంధ్రులహక్కు (@RamMNK) January 23, 2022
– యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం
ఇవాళ చినబాబు బర్త్ డే.. ఎన్నో కష్టాలలో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయ సారథి ఆయనే అన్న భావన ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఆ మాటను నిజం చేసేందుకు లోకేశ్ శ్రమిస్తున్న తీరు బాగుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.ముఖ్యంగా కార్యకర్తల్లో ఉన్న నిరాశను పోగొట్టేందుకు లోకేశ్ చేయాల్సిన పనులెన్నో! ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు, విపక్షం సత్తా మరియు స్థాయి నిరూపించేందుకు చేయాల్సిన నిరసనల కార్యక్రమాలు ఎన్నో! పుట్టిన్రోజు వేళ వీటిపై దృష్టిసారించాలి.
లోకేశ్ కు ఇంకా పరిణితి రాలేదు అన్నది ఓ విమర్శ ఉంది.ఆయన చెప్పిన మాట కొందరు సీనియర్లు వినరు అన్న మాట కూడా ఉంది. యువ నాయకులు కొందరు ఆయనవైపు అన్నా అగ్రనాయకత్వం చెప్పిన విధంగా లోకేశ్ మాట ఎవ్వరూ వినరు. కనుక ఆయన ముందు తన సమర్థతను పెంపొందించుకోవాలి. ప్రజల్లోకి రావాలి ర్యాలీలలో,నిరసనలలో కాదు క్షేత్ర స్థాయి సమస్యలపై పోరాటం చేయగలగాలి.ఆ విషయమై ఆయన మరింత శ్రద్ధ వహించాలి కూడా! పుట్టిన్రోజు కదా నాలుగు మంచి మాటలే చెబుదాం.
ముఖ్యంగా పార్టీలో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటిని దాటించే ప్రయత్నం యువ నాయకత్వమే చేయాలి. లోకేశ్ ఒక పాదయాత్రకు శ్రీకారం దిద్దితే ఆయనకు సమస్యలు తెలుస్తాయి. పరిణితి వస్తుంది. అదేవిధంగా కార్యకర్తల కష్టాల వేళ చంద్రబాబు మాత్రమే కాదు లోకేశ్ కూడా పరుగులు తీసి వారిని చేరుకుని, సమస్యను అర్థం చేసుకోవాలి. అలా చేయకపోతే లోకేశ్ ను నాయకుడిగా ఎవ్వరూ అంగీకరించరు. టైలర్ మేడ్ లీడర్ షిప్ అన్నది అన్ని వేళలా సాధ్యం కాదు కనుక ఇవాళ ఆయన అర్థం చేసుకోవాల్సింది. నేర్చుకోవాల్సింది ఎంతో!