హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్… లక్ష్యాన్ని చేదించేలా కనిపించింది.అయితే చివరికి రాజస్థాన్ జట్టు చేతులెత్తేసింది. 7 వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులు మాత్రమే చేసింది.
దీంతో హైదరాబాద్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.అయితే ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు వేసిన నటరాజను రెండు వికెట్లు తీసి 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ టోర్నమెంట్ మొదటి నుంచి పొదుపుగా బౌలింగ్ వేస్తూ వికెట్లు ఎక్కువగా తీస్తున్నాడు నట్టు. ఈ తరుణంలోనే తాజాగా పర్పుల్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2024 టోర్నమెంటులో 8 మ్యాచులు ఆడిన నటరాజన్… 15 వికెట్లు పడగొట్టి టాప్ పొజిషన్లో నిలిచాడు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐని ఫాన్స్ తిడుతున్నారు. బంగారం లాగా క్రికెట్ ఆడుతున్న నటరాజన్ ను… టి20 వరల్డ్ కప్ కు ఎందుకు సెలెక్ట్ చేయలేదని బిసిసిఐపై మండి పడిపోతున్నారు ఫ్యాన్స్. తమిళనాడుకు చెందాడనే నేపథ్యంలో బీసీసీ నటరాజన్ ను సెలెక్ట్ చేయలేదని అంటున్నారు.