T20WC 2024: నేటి నుంచి సూపర్-8 మ్యాచ్‌లు

-

T20 WC 2024 Super 8: టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా కూడా అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్లు విజయం సాధించి నేరుగా సూపర్ 8 కు వెళ్ళింది టీం ఇండియా. ఇక ఇవాల్టి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి.

T20 WC 2024 Super 8 Schedule

టి20 వరల్డ్ కప్ లో నేటి నుంచి సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభించనుంది ఐసీసీ. ఇందులో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ గ్రూప్ 2 లోని యూఎస్ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గ్రూప్ స్టేజీలో సంచనాలు చేసిన అమెరికా జట్టు ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే కీలక… సూపర్ 8 స్టేజీలో దక్షిణాఫ్రికా ఓడిపోతూ వస్తుంది. మరి ఇవాళ కచ్చితంగా గెలవాలని కసితో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news