కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే?

-

కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్లనున్నారు.  చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య పార్టీ మారనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కూమార్‌తో భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

దీంతో యాదయ్య సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక అటు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేను మన పార్టీకి రానీవొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా గద్వాలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ సొంత పార్టీ నాయకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనే వార్తల నేపత్యంలో కాంగ్రెస్ క్యాడర్ అలెర్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news