టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన ఘనత

-

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత నెలకొల్పారు. టీ20 ప్రపంచకప్ లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న తొలి భారత కెప్టెన్ గా హిట్ మ్యాన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు మరే భారత కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకోలేదు. కాగా… ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 41 బంతుల్లోనే 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు.

Team India captain Rohit Sharma has achieved a rare feat in the history of T20 World Cup

ఇక అటు ఆస్ట్రేలియాపై త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న రోహిత్ అరుదైన రికార్డుకు దూరమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే WC, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో హిట్ మ్యాన్ ఇప్పటికే సెంచరీలు బాదారు. నిన్న కూడా శతకం బాది ఉంటే అన్ని ICC ఈవెంట్లలో సెంచరీ బాదిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించేవారు. కానీ 92 పరుగుల వద్ద స్టార్క్ అవుట్ చేశారు. అయితే నిన్నటి రోహిత్ ఇన్నింగ్స్ సెంచరీ కంటే గొప్పదని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news