IND VS WI : చరిత్ర సృష్టించిన టీమిండియా.. కెప్టెన్ గా ధావన్ రికార్డ్

-

వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1980 3 సంవత్సరం నుంచి వెస్టిండీస్ తో ద్వైపాక్షిక వన్డే సిరీస్ లు ఆడుతున్న టీమిండియా 39 ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ ఈ ఫీట్ సాధించిన తొలి టీమ్ ఇండియా కెప్టెన్ గా అవతరించాడు. ఇక రేపటి నుంచి ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.

కాగా…వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలోనూ ధావన్ సేన గ్రాండ్ విక్టరీ అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా డక్ వర్త్ లుఈస్ పద్ధతిలో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేదించే నేపథ్యంలో వేస్టిండీస్ 26 ఓవర్లలోనే 137 మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news