NTRను కలిసిన టీమిండియా క్రికెటర్లు..ఫోటోలు వైరల్‌

-

హైదరాబాద్‌ వేదికగా, న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఈ నెల 18న అంటే రేపు జరుగనుంది.ఈ నేపథ్యంలోనే.. మొన్న న్యూజిలాండ్‌ హైదరాబాద్‌ రాగా, నిన్న టీమిండియా వచ్చింది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇక హైదరాబాద్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లను హీరో ఎన్టీఆర్ ఓ హోటల్ లో కలిశాడు. వారితో కొద్దిసేపు ముచ్చటించాడు. అనంతరం ఎన్టీఆర్ తో గిల్, శ్రేయస్ అయ్యర్, చాహాల్, ఇషాన్ కిషన్, సూర్య, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఫోటోలు దిగారు. కాగా, ఇవాళ ఉదయం నుంచి ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం నుంచి మ్యాచ్ జరగనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version