టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్-సౌతాఫ్రికా తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. తొలి ఓవర్ లోనే 14 పరుగులు లభించాయి. మొదటి ఓవర్ లో విరాట్ కోహ్లీ మూడు ఫోర్లు బాదాడు. టీమిండియా మంచి ఊపులో ఉందనుకునే సమయంలోనే రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కాగానే క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ డకౌట్ కావడం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ చెప్పాలి. వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా రెండో ఓవర్ లోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా మంచి జోష్ నింపారు. ఐదో ఓవర్ లో రబడా బౌలింగ్ లో సూర్య కుమార్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4.2 ఓవర్లకు 34/3. హోరా హోరీగా సాగే ఈ మ్యాచ్ లో విజయం ఎవ్వరినీ వరిస్తుందో వేచి చూడాలి.