Asia Cup 2023 : భారత్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు

-

Asia Cup 2023 : భారత్‌కు చేరుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఆసియాకప్ విజయం తర్వాత టీమిండియా ప్లేయర్లు స్వదేశానికి చేరుకున్నారు. నిన్న కోలంబోలో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

Team India players reached India
Team India players reached India

భారత ఆటగాళ్లు శ్రీలంక నుంచి బయలుదేరి ఇవాళ ఉదయం ముంబై కలిన విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా… భారత్ ఈనెల 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.

కాగా ఆసియా కప్ ఫైనల్  మ్యాచ్లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంతో మహమ్మద్ సిరాజ్ ఆరు వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించాడు. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 6.1 ఓవర్లలోనే సాధించింది. ఆ తర్వాత విజేతగా టీమిండియా 150,000 US డాలర్లను (రూ. 1 కోటి 25 లక్షలు) ప్రైస్ మనీగా అందుకుంది. రన్నరప్ గా శ్రీలంక జట్టుకు ప్రైజ్ మనీగా US $75,000 (రూ.62 లక్షలు) దక్కించుకుంది. అటు సిరాజ్… గ్రౌండ్ స్టాఫ్ కు ఆర్థిక సాయం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news