శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన సిరీస్ ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 390 పరుగులు చేసింది.
దీంతో శ్రీలంకకు 391 పరుగుల భారీ టార్గెట్ ను నిర్దేశించింది. అయితే చేదనలో శ్రీలంక జట్టు 73 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేలో అత్యధిక పరుగులు తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఐలాండ్ బై 2009 పరుగుల తేడాతో 2008 సంవత్సరంలో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది.