వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ గ్రూపు దశలో చివరి మ్యాచ్ భారత్-నెదర్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులను సాధించింది. ఈ వరల్డ్ కప్ లో భారత్ కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. రోహిత్ శర్మ 61, శుభ్ మన్ గిల్ 51, కోహ్లీ 51, రాణించగా.. శ్రేయస్ అయ్యర్ 128, కే.ఎల్.రాహుల్ 102 పరుగులతో చెలరేగారు. భారత భ్యాటర్ల ధాటికి నెదర్లాండ్స్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పాల్ వాన్, రోలోఫ్ వాన్, బాస్ డి లీడె తలో వికెట్ తీశారు.
ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ కే.ఎల్.రాహుల్ విధ్వంసకర శతకం సాధించాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో రాహుల్ కి ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. మరోవైపు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతమైన సెంచరీ సాధించడంతో భారత్ 410 పరుగులను సాధించింది. నెదర్లాండ్ విజయ లక్ష్యం 411 పరుగులు సాధించాలి. ఇది చాలా కష్టతరమనే చెప్పవచ్చు. భారత్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్ 100 లోపే ఆలౌట్ అయ్యే అవకాశముంది.