ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల భావోద్వేగం

-

మరో రెండు నెలల్లో ఐపీఎల్ షురు కానుంది. టీమ్ ఎంపికకు సంబంధించి వేలం పాటలు కూడా కొనసాగుతున్నాయి. కొందరు ఆటగాళ్లు అహర్నిశలు పడ్డ కష్టానికి అదృష్టం తోడైనట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ ఎంపికలో తమ పేరు వచ్చిందంటే చాలు.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. ఐపీఎల్ వేలంలో ఊహించని రీతిలో వారికి ధరలు పలుకుతాయి. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న వేలం పాటలో తమకు అంత ధర పలుకుతుందని అసలు ఊహించలేదని కొందరు ఆటగాళ్లు భావిస్తున్నారు. ఎంతో సంతోషంగా ఉందని.. తమ భావోద్వేగాలను పంచుకున్నారు.

టెన్నిస్ బంతితో నా క్రికెట్ ప్రయాణం: షారుఖ్ ఖాన్
ఐపీఎల్ వేలం జరుగుతున్నప్పుడు విజయ్ హజారే ట్రోఫీ కోసం నేను తమిళనాడు జట్టు బస్సులో బయలుదేరుతున్నాను. ఐపీఎల్‌ వేలంలో నా పేరు వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. వేలంలో నాకు రూ.5.25 కోట్ల ధర పలికింది. ఐపీఎల్‌లో ఛాన్స్ రావడంతో నా తోటి సహచరులు, కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎంతో ఆనంద పడ్డారు. టెన్నిస్ బంతితో నా క్రికెట్ ప్రయాణం మొదలైంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఉంది.

నమ్మలేక పోయాను : ఆస్ట్రేలియా ఫేసర్ రిచర్డ్ సన్
వేలం పాటలో నా కోసం ఫ్రాంచైజీలు పోటీపడటం నమ్మలేకపోయాను. వేలం ప్రారంభంలో ఏ జట్టు నా కోసం ముందుకు రాలేదు. మొదట్లో భయం వేసినా.. ఆ తర్వాత ఫ్రాంఛైజీలు నా కోసం అంతలా పోటీ పడుతూ ధర పెంచుతూ వచ్చారు. పంజాబ్ కింగ్స్ నన్ను రూ.14 కోట్లకు కొనుక్కుందా అనే సందేహం ఇంకా నా మదిలో మెదులుతూనే ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఓ మ్యాచ్ ఆడి గెలిచిన ఫీలింగ్ కలిగింది.

Krishnappa-Gowtham
Krishnappa-Gowtham

నా పేరు వచ్చినప్పుడు ఒత్తిడికి లోనయ్యా : కృష్ణప్ప గౌతమ్
టీవీలో వేలం పాట చూస్తూ కూర్చున్న.. సడెన్‌గా నా పేరు వినిపించింది. ఆ సమయంలో ఎంతో ఒత్తిడికి లోనైనట్లు అనిపించింది. ఊహించని రీతిలో చైన్నై సూపర్ కింగ్స్ రూ.9.25 కోట్లతో కొనుగోలు చేసింది. ధోనికి నేను వీరాభిమానిని. ఇప్పుడు ఆయనతోనే కలిసి జట్టులో ఆడబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news