తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ … తొలి మ్యాచ్ లోనే విజయం !

-

ఈ రోజు నుండి దేశవాళీ టోర్నీలలో భాగంగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 టోర్నమెంట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ లో తలపడిన హైద్రాబాద్ మేఘాలయ పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఈ సీజన్ ను విజయంతో స్టార్ట్ చేసింది. ఈ సీజన్ కు గాను హైదరాబాద్ జట్టు యాజమాన్యం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ను సారధిగా నియమించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ జట్టు నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అనంతరం పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 40 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ తిలక్ వర్మ 31 బంతుల్లో 3 ఫోర్లు మరియు 2 సిక్సులతో 2 పరుగులు చేశాడు. ఇతనికి తన్మయ్ అగర్వాల్ (46) నుండి చక్కని సహకారం లభించింది.

ఇండియా క్రికెట్ జట్టులో సభ్యుడుగా ఉన్న తిలక్ వర్మ జాతీయ టోర్నీలలోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news