IPL 2024 : రేపే ఐపీఎల్‌ 2024 టోర్నమెంట్‌ వేలం..300 మంది ప్లేయర్ల మధ్య పోటీ

-

IPL 2024 : రేపే ఐపీఎల్‌ 2024 టోర్నమెంట్‌ వేలం జరుగనుంది. ఐపీఎల్ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 19న ఈ వేలం జరుగుతుంది. 300పై చిలుకు క్రికెటర్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. వరల్డ్ కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్రతో పాటు సీనియర్ క్రికెటర్లు మిచెల్ స్టార్క్, కోయెట్జీ, హర్షల్ పటేల్, హసరంగా, డారిల్ మిచెల్ వన్డే క్రికెటర్లపై అందరి దృష్టి నెలకొంది. వీరిలో ఎక్కువ ధర ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

కాగా,  ఐపీఎల్ లో రాణించిన ఆటగాళ్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ క్యాప్డ్ ప్లేయర్లకు ఈ నజరానా అందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఐపీఎల్ లో రాణించి అంతర్జాతీయ జట్టులోకి ఎంపికై పదికి పైగా మ్యాచ్లు ఆడిన వారికి నజరానాను డబుల్ చేయాలని నిర్ణయించినట్లు టాక్. ఐపీఎల్ వేలంలో రూ. 50 లక్షలకు పైగా ధర పలికిన వారికి మాత్రమే ఈ ఇన్సెంటివ్స్ వర్తించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news