సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది : నారాయణ

-

సీపీఐ ఓట్లు కలవడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల మెజార్టీకి సీపీఐ ఓట్లు దోహదం చేశాయని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో ఓడిపోయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందని వెల్లడించారు.

“కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పూరితంగా కాకుండా వర్క్ పూరితంగా మార్పులు చేసుకుంటే నయం. పదవీ విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదు. ఇండియా కూటమి ఎంత అవసరమో, కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవడం కాంగ్రెస్కు అంత ముఖ్యం. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తాం. తెలంగాణ, ఏపీల్లో ఒక్కోస్థానంలో బరిలో నిలుస్తాం. బీజేపీ తెలుగు ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉంది.” అని నారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news