ఆయుధాలు లేని యుద్ధం రెడీ : ప్రొ క‌బ‌డ్డీ వీడియో లో నాగ చైత‌న్య

ప్రొ క‌బ‌డ్డీ కి రంగం సిద్ధం అయింది. ఈ నెల 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భం గా తెలుగు టైటాన్స్ కు సంబంధించిన వీడియో విడుద‌ల అయింది. ఈ వీడియో లో టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత‌న్య ప్రొ క‌బడ్డీ గురించి.. తెలుగు టైటాన్స్ గురించి చెబుతూ వీడియో వ‌చ్చింది. ”జెర్సీ మాత్ర‌మే కాదు.. క‌వ‌చం అది.. గ్రౌండ్ మాత్ర‌మే కాదు.. పోరాట స్థ‌లం అది.. ఆయుధాలు లేకుండా జ‌రిగే ఈ అత్యుత్త‌మ యుద్ధం లో తెలుగు టైటాన్స్ స‌త్తా చాట‌డానికి సిద్ద‌మంటుంది. రా చూద్దం!”

అంటూ నాగ చైత‌న్య చెబుతున్న డైలాగ్స్ హైలైట్ గా ఉన్నాయి. అయితే ఈ టోర్నీ లో తెలుగు టైటాన్స్ కు ప్ర‌చార క‌ర్త గా నాగ చైత‌న్య వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కాగ ఈ మెగా టోర్నీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణం గా ఇప్ప‌టి వ‌ర‌కు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఈ నెల 22 నుంచి ఈ ప్రొ క‌బ‌డ్డీ టోర్నీ ప్రారంభించ నున్నారు.