ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా కొల్ కతా వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నిన్న రాత్రి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ను కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరాను కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లను పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు.
అలాగే POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. టేబుల్ టాపర్ గా పంజాబ్ కింగ్స్ కొనసాగుతోంది. 5 జట్లు 4 పాయింట్లతో మరో 5 జట్లు 2 పాయింట్లతో నిలిచాయి. పాయింట్స్ టేబుల్స్ లో పంజాబ్ తరువాత DC, RCB, GT, KKR, MI, LSG, CSK, RR, SRH ఉన్నాయి.