తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది.

తెలంగాణలో మరో రెండు రోజులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులు స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.