ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సత్తా చాటాలంటే అంతకంటే ముందు ఏడాది చివరిలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని వెటరన్ బౌలర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్‌లో స్పిన్నర్ బెర్త కోసం కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్ మధ్య తీవ్ర పోటీ ఉన్నా జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు తప్పనిసరి అని హర్భజన్ పేర్కొన్నారు.
ఫిటెనెస్ సమస్యలను అధిగమించిన వరుణ్ చక్రవర్తి ఎట్టకేలకు భారత్ తరఫున తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ శ్రీలంకతో ఆడాడు. నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని హర్భజన్ సింగ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ జట్టులో స్పిన్నర్‌గా ఉండటానికి వరుణ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక కావడానికి వరుణ్ చక్రవర్తికి అన్ని అర్హతలు ఉన్నాయని నా అభిప్రాయం. అతను వికెట్లు తీయగలడు. ‘పరుగులను ఆపగలడు. పవర్‌ప్లేనే కాదు అవసరమైతే డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేయగలడని తెలిపాడు. ఎక్కువగా అధైర్యపడటం అతనిలో ఉన్న ఏకైక లోపం. కేకేఆర్ జట్టుకు ఆడుతున్న సమయంలో వరుణ్‌తో కొంత సమయం వెచ్చించాను. వరుణ్ శక్తి సామర్థ్యాల గురించి అతడికే సరిగా తెలియదు’ అని పేర్కొన్నాడు.